2017 రాశిఫలాలు-ఖచ్చితంగా చేయాల్సినవి..చేయకూడనవి-5

సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
ఈ మాసం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. ఆత్మీయులకు శుభాకాంక్షలు, కానుకలు అందిస్తారు. మీ శ్రీమతి వైఖరి ఆశించిన మార్పు సంభవం. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. స్త్రీల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక అంచనాలు ఫలించవు. ఊహించని ఖర్చుంటాయి. ధనం అతికష్టంమ్మీద సర్దుబాటు అవుతుంది. బంధుమిత్రులతో అకారణ కలహం, చికాకులు తలెత్తుతాయి. ఓర్పు, రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. వ్యవహారాలు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.ఇంకా ఉంది

No comments

Powered by Blogger.