2017 రాశిఫలాలు-ఖచ్చితంగా చేయాల్సినవి..చేయకూడనవి-3

మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
ఈ మాసం ప్రథమార్థం ఏమంత అనుకూలం కాదు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆత్మీయుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితం ఉండదు. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. దంపతుల మధ్య ఉత్సాహం నెలకొంటుంది. చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం వీడండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు, నూతన పెట్టుబడులకు అనుకూలం. సేవ, సామాజిక, సన్మాన సభల్లో పాల్గొంటారు.ఇంకా ఉంది

No comments

Powered by Blogger.