కలియుగాంతమున లేచి రంకె వేసే బసవన్న-2


సహజసిద్ధమైన గుహలు
యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. వెంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్టించాడు. ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల పూజలనందు కొంటున్నాడు. ఆ ప్రక్కనె ఇంకో గుహ లో బ్రంహం గారు కొంత కాలం నివసించారని, శిష్యులకు ఙానోపదేశం చేసాడని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ , రోకళ్ళగుహ అనికూడా అంటారు. యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర వున్న బనగాన పల్లి లో వసతులున్నాయి. ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలో మీటర్ల దూరంలో వున్నది. కర్నూలు, బనగాన పల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం వున్నది.

యాగంటి బసవన్న
ఇక ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ వుండటం . పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేసాడని బ్రహ్మంగారి కాలఙానం లో ప్రస్థావించబడి ఉంది.

యుగాంతంతో ముడిపడిఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.గుడి నిర్మాణం జరుగుతున్నప్పుడు ,పని వారు రాయిని పగలకొట్టిన ప్రతిసారి తిరిగి అతుక్కుని పరిమాణం పెరుగుతూండేప్పటికి భయపడ్డారంట. శివుని ఆదేశం మేరకు స్వయానా ఆ నందీశ్వరుడు వేలిసాడంట.

ఇక్కడ ఉన్న నంది విగ్రహం చెక్కిన విగ్రహం కాదు,రాయి నంది ఆకారం దాల్చింది .
ఇప్పటికీ నంది ,పరిమాణం లో పెరుగుతూ ఉంది .ఇంకా ఉంది

No comments

Powered by Blogger.