2017 రాశిఫలాలు-ఖచ్చితంగా చేయాల్సినవి..చేయకూడనవి-4

కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆత్మీయులకు శుభాకాంక్షలు, కానుకలు అందిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. శుభవార్తలు వింటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. అవకాశాలు అందినట్టే చేజారిపోతుంటాయి. నిరుద్యోగులకు ఓర్పు ప్రధానం. కళాత్మక పోటీల్లో స్త్రీలు విజయం సాధిస్తారు. విందులు, వేడుకల్లో మితంగా ఉండాలి. ద్విచక్ర వాహన చోదకులకు అత్యుత్సాహం తగదు.ఇంకా ఉంది

No comments

Powered by Blogger.